ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..!

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.ప్రవేశ పరీక్షల తేదీలకు సంబంధించిన హెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.ఇక సెప్టెంబర్ 10, 11వ తేదీల్లో ఐ-సెట్, సెప్టెంబర్ 14వ తేదీన ఈ-సెట్, సెప్టెంబర్ 28, 29, 30న ఏపీ పీజీఈ-సెట్ పరీక్షలు జరగనున్నాయి.

Andra Pradesh, Ap Entrance Exams Dates, Education Minister Adhimulapu Suresh, Ea

ఇక అక్టోబర్ 1వ తేదీన ఉదయం ఎడ్ సెట్, మధ్యాహ్నం లా-సెట్ నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.అక్టోబర్ 2 నుంచి 5వ తేదీ వరకు ఏపీపీఈ సెట్ పరీక్షలు జరగనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణలో ఈ నెల 31న ఈ-సెట్, సెప్టెంబర్ 2వ తేదీన పాలిసెట్, సెప్టెంబర్ 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Advertisement
వేగములు ఎన్ని, అవి ఏవి?

తాజా వార్తలు