ఎంతమంచివాడవురా రన్‌టైమ్.. హైలైట్స్ ఇవేనట!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ఎంత మంచివాడవురా అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాను శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ కొడుతుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమా సంక్రాంతి రిలీజ్‌లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలతో పోటీగా వస్తోంది.దీంతో ఈ సినిమా ఎంతమేర విజయం సాధిస్తుందా అని అందరూ అనుకుంటున్నారు.

కాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.అయితే ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 22 నిమిషాలుగా చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.

ఈ నిడివి సాధారణ సినిమాలకు సెట్ అయ్యే విధంగా ఉండటంతో ఈ సినిమా చూసినంతసేపు బోర్ కొట్టకుండా ఉంటుంది.అయితే ఈ సినిమా మరో రెండు పెద్ద సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలతో పోటీలో దిగుతుంది.

Advertisement

మరి వాటితో ఈ సినిమా పోటీ పడగలదా? అనేది సందేహంగా ఉంది.ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది.

అటు క్లైమాక్స్‌లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా సినిమాను మరో లెవెల్‌కు తీసుకుపోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.ఈ రెండు సీక్వెన్సులు సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా సతీష్ వేగ్నేశ గతంలో తెరకెక్కించిన శతమానం భవతి చిత్రం ఈ ఫీట్‌ను చేసి చూపించింది.అదే నమ్మకంతో ఇప్పుడు రెండు పెద్ద సినిమాల మధ్య ఈ చిన్న సినిమా రిలీజ్ అవుతోంది.

మరి ఈ సినిమా ఎంత వరకు విజయం సాధిస్తుందనేది చూడాలి.

మెరిసే చర్మం కోసం అరటిపండు పేస్ పాక్స్
Advertisement

తాజా వార్తలు