పుష్ప 2 ప్లేస్ ను రీప్లేస్ చేస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ( Allu Arjun ) లాంటి హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఆయన డ్యాన్సులు గాని, ఫైట్లు గాని చేస్తూ తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఈయన పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో మరొకసారి ప్రేక్షకులను మెప్పించడానికి ఆగస్టు 15వ తేదీన వస్తున్నట్టుగా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన వచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది.

ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.దాంతోపాటుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా స్లోగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక దీంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double Ismart Movie ) ఆగస్టు 15వ తేదీన వస్తున్నట్టుగా సినిమా మేకర్స్ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు.

ఇక మొత్తానికైతే డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇక ఆగస్టు 15వ తేదీన రానట్టే అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి రామ్( Ram ) భారీ క్రేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమా సక్సెస్ అయితే ఇటు పూరి జగన్నాథ్ కి, అటు రామ్ కి ఇద్దరికీ కూడా చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని కొట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.అయితే పూరి కి ఇప్పుడు పెద్ద హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ సినిమాతో ఆయన మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Advertisement

తాజా వార్తలు