దానిని కనిపెడితే 100 మిలియన్ డాలర్లు ఇస్తా అంటున్న ఎలాన్..!

ప్రపంచ  టెస్లా, స్పెస్ ఎక్స్​ , అధినేత ఎలన్ మాస్క్ తాజాగా ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.

ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా.

సోషల్ మీడియా వేదికగా కార్బన్​ డయాక్సైడ్ ఉద్గారాలు( carbon dioxide emissions) నిల్వ చేసే టెక్నాలజీ ఎవరైనా కనిపెడితే వారికి 100 మిలియన్ డాలర్లను గిఫ్ట్ గా ఇస్తాను అని తెలియజేశాడు.ప్రస్తుతం పరిశ్రమలో టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కార్బన్​ డయాక్సైడ్ ఉద్గారాలును ఎదుర్కోవాల్సి అవసరం ఉంటుంది, దీనివల్ల కాలుష్యం ఎక్కువగా పేరుకొని పోయి గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ సమస్యను ఎదుర్కొనేందుకు  కార్బన్ డయాక్సైడ్ నిల్వ చేసేందుకు సరైన టెక్నాలజీని కని పెడితే బాగుంటుందని తెలియచేశాడు.ఎలాన్ మాస్క్ సోషల్ మీడియా వేదికగా “బెస్ట్ కార్బన్​ క్యాప్చర్ టెక్నాలజీని కనుగొంటే నేను 100 మిలియన్ డాలర్లు డొనేట్ చేస్తా.

  పూర్తి వివరాలు వచ్చే వారం  తెలియచేస్తానని " ట్వీట్ రూపంలో తెలిపారు.

Elon Musk Offers 100 Million Dollars Who Finds This Technology, Elon Musk, 100 D
Advertisement
Elon Musk Offers 100 Million Dollars Who Finds This Technology, Elon Musk, 100 D

ఇక ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఏలన్ మాస్క్ నిలిచాడు.మార్కెట్లో కూడా టెస్లా ఎలక్ట్రిక్ కార్లు సూపర్ సక్సెస్ అవడంతో ముందు స్థాయికి దూసుకొని పోతున్నాడు ఎలాన్ .ఇది ఇలా ఉండగా మరోవైపు అమెరికా కొత్త  అధ్యక్షుడు జో బైడెన్  కూడా కర్బన ఉద్గారాల అంశంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.వాతావరణలో వచ్చే మార్పులను నిరోధించే ప్రయత్నంలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఎంతటి కృషినైనా  చేస్తామని జో బైడెన్ పేర్కొన్నారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు