ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవి..: సీఎం జగన్

అన్నమయ్య జిల్లా( Annamayya District ) కలికిరిలో సీఎం జగన్( CM Jagan ) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

రానున్న ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవని తెలిపారు.మే 13న జరగబోయే ఎన్నికలు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కాదని సీఎం జగన్ పేర్కొన్నారు.

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.వైసీపీకి ఓటు వేస్తేనే అన్ని పథకాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

పొరపాటున చంద్రబాబుకు ( Chandrababu ) ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలికినట్లేనని చెప్పారు.చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుందన్న సీఎం జగన్ ఎద్దేవా చేశారు.రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలని తెలిపారు.2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలను ఇచ్చారన్న ఆయన ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.బాబుకు ఓటు వేసి రైతన్నలు, అక్కచెల్లెమ్మలు నష్టపోయారని పేర్కొన్నారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు