టీఆర్ఎస్ లో సంబరాలు... కొత్త కమిటీలు ?

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ గత కొంతకాలంగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.ఈ విషయం అనేక సర్వేలు, ఇంటలిజెన్స్ రిపోర్ట్ ల ద్వారా తేలిపోయింది.

దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం ప్రజల్లో తిరుగుతూ,  ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.రకరకాల కొత్త పథకాలను ప్రవేశపెడుతూ, మళ్ళీ తమ ప్రభుత్వానికి తిరుగులేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం హుజురాబాద్ పై పూర్తిగా దృష్టి పెట్టి కొత్త కొత్త హామీలను, పథకాలను ప్రవేశపెడుతున్నారు.ఈ  నియోజకవర్గంలో కనుక గెలిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

        ఈ మేరకు నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇది ఇలా ఉంటే ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్న కేసీఆర్ పార్టీ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే అసంతృప్తి ఆ పార్టీ నాయకుల్లో నెలకొంది.

Advertisement

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడున్నర ఏళ్లలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టకపోవడం , అదే సమయంలో కాంగ్రెస్,  బీజేపీలు మండల, గ్రామ నియోజకవర్గ జిల్లా స్థాయి కమిటీలను నియమించి.పార్టీ కేడర్ ను ఏకం చేస్తూ బలపడేందుకు ప్రయత్నం చేస్తూ ఉండటం తదితర అంశాలు టిఆర్ఎస్ ను కలవరానికి గురిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొత్త కమిటీల ఎంపికకు టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.ఈ మేరకు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీలను ఎంపిక చేసే విధంగా కార్యాచరణను రూపొందించారు.       

జిల్లా , గ్రామ, మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ , డివిజన్, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు.ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాస్థాయి,  రాష్ట్రస్థాయి లో పార్టీ పదవులను కేటాయించే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా పార్టీ అనుబంధ సంఘాలను కూడా ఎంపిక చేసి , బి.

సి, ఎస్.టి, ఎస్సీ, మైనారిటీ, రైతు, విద్యార్థి , మహిళ, యువజన, సోషల్ మీడియా విభాగాలు అన్నిటినీ నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రతి కమిటీలోనూ 15 మంది సభ్యులు ఉండే విధంగా ప్రణాళికలు రచించారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

పార్టీ పదవుల విషయంలో పూర్తిగా వీర విధేయులు కు, మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతూ వస్తున్న వారికి మాత్రమే కేటాయించే విధంగా ప్లాన్ చేశారు.అలాగే ఈ కమిటీల నియామకం లో సామాజిక వర్గాల సమతూకం పాటించే విధంగా ప్లాన్ చేశారు.

Advertisement

  ఓసీ ,బీసీ, ఎస్సీ ,ఎస్టీ ,మైనారిటీ మహిళలకు సమానంగా అవకాశాలు ఉండేలా చూస్తున్నారు.ప్రస్తుతం పార్టీ కమిటీల నియామకం విషయంలో తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతుండడంతో,  టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

చాలా కాలం తర్వాత కేసీఆర్ ఈ విధంగా పార్టీ పటిష్టత కోసం పార్టీలో పదవులు లేక అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించేందుకు పెద్ద ఎత్తున కమిటీల నియామకం పై దృష్టి పెట్టడం l టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం కలిగేలా చేస్తున్నాయి.

తాజా వార్తలు