విట‌మిన్ డి లోపం ఉంటే వింట‌ర్‌లో ఆ తిప్ప‌లు త‌ప్ప‌వు..జాగ్ర‌త్త‌!

వింట‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది.ఈ చ‌లి కాలంలో వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల వ‌ల్ల ఎన్నెన్నె అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

వాటి నుంచి త‌ప్పించుకుని ఆరోగ్యాన్ని ర‌క్షించుకోవాల‌నుకుంటే.శ‌రీరానికి త‌ప్ప‌ని స‌రిగా కొన్ని కొన్ని పోష‌కాలు ఎంతో అవ‌స‌రం.

అటు వంటి వాటిల్లో విట‌మిన్ డి ఒక‌టి.కానీ, ఈ మ‌ధ్య కాలంలో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది విట‌మిన్ డి లోపానికి గుర‌వుతున్నాయి.

అయితే మిగిలిన సీజ‌న్ల‌ను ప‌క్క‌న పెడితే.వింట‌ర్ లో మాత్రం విట‌మిన్ డి లోపం ఉంటే తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు నిపుణులు.

Advertisement
Effects Of Vitamin D Deficiency In Winter! Vitamin D Deficiency, Vitamin D, Vita

మ‌రి లేటెందుకు విట‌మిన్ డి లోపం వ‌ల్ల ప్ర‌స్తుత ఈ చ‌లి కాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌లేంటో చూసేయండి.సాధార‌ణంగా వింట‌ర్‌లో అధిక చ‌లి కారణంగా గుండె పోటు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంద‌న్న విష‌యం తెలిసిందే.

దీనికి విట‌మిన్ డి లోపం తోడైతే.గుండెకు ముప్పు మ‌రింత పెరుగుతుంది.

అలాగే విట‌మిన్ డి లోపం ఉన్న వారు చ‌లి కాలంలో తీవ్రంగా అల‌సి పోతారు.చిన్న చిన్న ప‌నుల‌కు బలహీన పడిపోతుంటారు.

మ‌రియు కండ‌రాలు, కీళ్ల‌ నొప్పులు సైతం ఇబ్బంది పెడుతుంటాయి.

Effects Of Vitamin D Deficiency In Winter Vitamin D Deficiency, Vitamin D, Vita
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

వింట‌ర్ సీజ‌న్‌లో మామూలుగానే అందరి ఇమ్యూనిటీ సిస్ట‌మ్ వీక్‌గా ఉంటుంది.అందులోనూ విట‌మిన్ డి లోపం ఉంటే గ‌నుక‌ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మ‌రింత బ‌ల‌హీనంగా మారి.జ‌లుబు, ద‌గ్గు, జ్వరం మ‌రియు ఇత‌ర సీజ‌న‌ల్ వ్యాధులు ఎటాక్ చేసే రిస్క్ పెరుగుతుంది.

Effects Of Vitamin D Deficiency In Winter Vitamin D Deficiency, Vitamin D, Vita
Advertisement

అంతే కాదు, విట‌మిన్ డి లోపం ఉన్న వారు వింట‌ర్‌లో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌నూ, జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌నూ అధికంగా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అందుకే శ‌రీరంలో విట‌మిన్ డి లోపం ఏర్ప‌డ‌కుండా చూసుకోవాలి.అందు కోసం రోజు ఉద‌యం ఎండ‌లో అర గంట ఉండ‌టంతో పాటుగా గుడ్డు, పాల ఉత్ప‌త్తులు, పుట్ట‌గొడుగులు, చేప‌లు, బ్రొకోలీ, అవ‌కాడో, బొప్పాయి వంటి ఆహారాల‌ను తీసుకోవాలి.

త‌ద్వారా విట‌మిన్ డి శ‌రీరానికి పుష్క‌లంగా అందుతుంది.

తాజా వార్తలు