ఎంత ప్రయత్నించినా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ పోవడం లేదా.. అయితే ఇదే బెస్ట్ ఆప్షన్!

సాధారణంగా ప్రసవం అనంతరం ప్రతి మహిళకు పొట్టపై స్ట్రెచ్ మార్క్స్( Stretch marks ) ఏర్పడుతుంటాయి.

ఈ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట శరీరం సాగినట్లు కనిపిస్తూ ఉంటుంది.

స్ట్రెచ్ మార్క్స్ ఉండటం వల్ల ఎలాంటి నష్టం లేకపోయినా చూడటానికి మాత్రం చాలా అసహ్యంగా కనిపిస్తాయి.స్ట్రెచ్ మార్క్స్ కారణంగా ఇష్టమైన దుస్తులు ధరించ లేకపోతారు.

ఈ క్ర‌మంలోనే వీటిని నివారించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.తోచిన చిట్కాలను పాటిస్తుంటారు.

అయితే ఎంత ప్రయత్నించినా లాభం లేకుంటే కొందరు స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ ట్రీట్మెంట్ ను చేయించుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే ట్రీట్మెంట్ అక్కర్లేదు.

Advertisement

ఇంట్లోనే సులభంగా మరియు వేగంగా స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్( Vaseline ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ), హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అన్నీ కలిసే వరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పొట్టపైన అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా కనీసం ప‌ది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఇలా మసాజ్ చేసుకుని పడుకోవాలి.మ‌రుస‌టి రోజు గోరు వెచ్చని నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడానికి ఈ రెమెడీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

ఈ రెమెడీని రోజు పాటిస్తే చాలా వేగంగా స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ అవుతాయి.అదే సమయంలో పొట్ట వద్ద సాగిన చర్మం టైట్ గా కూడా మారుతుంది.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

కాబట్టి ఎవరైతే స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు