నెల‌సరి టైమ్‌లో మొటిమ‌లు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి!

సాధార‌ణంగా నెల‌స‌రి స‌మ‌యంలో చాలా మంది ఆడ‌వారిని కామ‌న్‌గా మ‌ద‌న పెట్టే స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

పైగా ఆ టైమ్‌లో వ‌చ్చే మొటిమ‌లు తీవ్ర‌మైన నొప్పిని క‌ల‌గ‌జేస్తుంటారు.

దాంతో వాటిని నివారించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.ఇరుగుపొరుగు వారు చెప్పిన చిట్కాల‌ను ప్ర‌య‌త్నిస్తుంటారు.

అయితే ఒక్కోసారి ఎన్ని చేసినా మొటిమ‌లు త‌గ్గ‌వు.అలాంట‌ప్పుడు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే నెల‌సరి టైమ్‌లో వేధించే మొటిమ‌ల‌ను ఈజీగా నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

Advertisement

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల ల‌వంగాల పొడి వేసి మ‌రిగించాలి.నీరు స‌గం అయ్యే వ‌ర‌కు హీట్ చేసి.

అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేయాలి.ఇప్పుడు స్ట్రైన‌ర్ సాయంతో లవంగాల నీటిని ఫిల్ట‌ర్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మ‌రో బౌల్ తీసుకుని.అందులో మూడు టేబుల్ స్పూన్ల బీస్వాక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ల కొకొన‌ట్ ఆయిల్‌, రెండు టేబుల్ స్పూన్ల ల‌వంగాల నీరు వేసుకుని డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో రెండు నిమిషాల పాటు హీట్ చేసుకుని.

చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంలో మూడు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌, హాఫ్ టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసి అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్‌లో నింపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లపై అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

Advertisement

ఆపై నార్మ‌ల్ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మొటిమ‌లు, వాటి తాలూకు మ‌చ్చ‌లు క్ర‌మంగా దూరం అవుతాయి.