జుట్టు ఎంత విపరీతంగా రాలుతున్న సరే ఇలా చేస్తే దెబ్బకు ఆగుతుంది!

జుట్టు ( Hair ) విపరీతంగా రాలిపోతుందా.? ఎంత ఖరీదైన ఆయిల్ షాంపూ వాడిన సమస్య పరిష్కారం కావడం లేదా.

? రకరకాల చిట్కాలు ప్రయత్నించి అలసిపోయారా.? అయితే ఇక‌పై అసలు చింతించకండి.జుట్టు ఎంత విపరీతంగా రాలుతున్న సరే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే దెబ్బకు ఊడటం ఆగిపోతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యను అదుపులోకి తెచ్చే ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు ( Fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్‌ తీసుకుని అందులో నానబెట్టుకున్న మెంతులు వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మెంతుల మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు మందారం పువ్వుల పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే కనుక జుట్టుకు చక్కని పోషణ అందుతుంది.

Advertisement

కుదుళ్ళు బలోపేతం అవుతాయి.దాంతో హెయిర్ ఫాల్ సమస్య అదుపులోకి వస్తుంది.

కాబట్టి ఎవరైతే అధిక‌ హెయిర్ ఫాల్ సమస్యతో మ‌ద‌న ప‌డుతున్నారో తప్పకుండా వారు ఈ రెమెడీని పాటించండి.హెయిర్ ఫాల్ కు బై బై చెప్పండి.పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.మరియు కురులు స్మూత్ అండ్ షైనీ గా సైతం మెరుస్తాయి.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు