తెల్ల జుట్టు( Grey hair )తో బాధపడుతున్నారా.? వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ పై ఆధారపడుతున్నారా.
? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే కలర్స్ అక్కర్లేదు.
సహజంగానే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ టీ పౌడర్, మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ ముక్కలు( Amla ) , వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్,( Henna Powder ) రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్ వేసుకోవాలి.అలాగే తయారు చేసి పెట్టుకున్న వాటర్ ను సరిపడా వేసి లూస్ స్ట్రక్చర్ లో కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి.మరుసటి రోజు హెన్నా మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.
ఈ రెమెడీ పాటించాక కలర్స్ ఎందుకు దండగ అని మీరే అంటారు.సహజంగానే తెల్ల జుట్టును నల్లగా( Black Hair ) మార్చడానికి ఈ హోమ్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడుగ్గా సైతం పెరుగుతుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy