తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నఈటెల రాజేందర్ వ్యాఖ్యలు..!!

తన నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్న తరహాలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నయి.హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సర్పంచులకు పై స్థాయి నాయకులు నిధుల విషయంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు .

అసలు నియోజకవర్గంలో వీళ్ళ గెలుపుకు మీరు ఏమైనా సహాయం చేశారా అంటూ ఈటల రాజేందర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.20 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలతో కలసి మెలసి ఉన్న బంధాన్ని.  కొన్ని అరాచక రాజకీయ శక్తులు విడదీయాలని చూస్తున్నాయి.

అటువంటి ఆటలు సాగవు అని పేర్కొన్నారు.ఎవరో సహచర మంత్రి వస్తాడు అని తెలిసింది.

Etela Rajender Sensational Comments Telangana, Etela Rajender, Etela Rajender

రండి తేల్చుకుందాం అని ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు.ఏమాత్రం నియోజకవర్గ ప్రజలు జోలికి వచ్చిన నాయకులు జోలికి వచ్చిన ఊరుకునే ప్రసక్తి లేదు.

నా నియోజకవర్గ ప్రజలను నా ప్రాణం పోయినా ఇబ్బంది పడకుండా కాపాడుకుంటా అని పేర్కొన్నారు.హుజూరాబాద్ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో ఆదరిస్తున్నారు .2006 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తన ఓటమిని చూడాలని అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా ఖర్చు పెట్టారు అయినా గాని నియోజకవర్గ ప్రజలు ప్రలోభాలకు లొంగి పోకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని తనని గెలిపించారని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు .20 ఏళ్లుగా తనని ఆదరిస్తున్నారని అటువంటి ప్రజలను ఇబ్బంది పెడితే కరీంనగర్ నడిబొడ్డులో మరో ఉద్యమం స్టార్ట్ అవుతుందని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నడవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

తాజా వార్తలు