మూడోసారి ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ...!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) మూడోసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను విచారించారు.

ఇదే సమయంలో ఆమె గత కొంతకాలంగా వాడిన ఫోన్లను ఈడీకి సమర్పించడం జరిగింది.ఈడీ విచారణకు వెళ్లే ముందు తాను వాడిన ఫోన్లను సీల్డ్ కవర్ లో కవిత మీడియాకు చూపించడం జరిగింది.

కాగా కవితను విచారిస్తున్న సమయంలోనే సాయంత్రం ఆమె లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకోవటం సంచలనం సృష్టించింది.

Ed Trial Of Mlc Kavitha Ended For The Third Time , Delhi Liquor Scam, Ed, Mlc Ka

అయితే ఈడీ అధికారులకు కవిత లీగల్ టీం పలు డాక్యుమెంట్లను అందించడం జరిగినట్లు సమాచారం.దీంతో నేటి విచారణ ముగిసినట్లు ఈడీ తెలపటంతో ఎమ్మెల్సీ కవిత ఈడీ కార్యాలయం నుండి బయటకు వచ్చారు.చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపిస్తూ కారులో ఆమె నివాసానికి బయలుదేరడం జరిగింది.

Advertisement
ED Trial Of MLC Kavitha Ended For The Third Time , Delhi Liquor Scam, ED, MLC Ka

ఈ క్రమంలో ఈడీ ఆఫీసు బయట BRS కార్యకర్తలు ఉండకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.దాదాపు 10 గంటల పాటు ఎమ్మెల్సీ కవితని ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు