తెలంగాణలో గ్రానైట్ కంపెనీలకు ఈడీ షాక్

తెలంగాణలో గ్రానైట్ కంపెనీలకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది.గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరపాలని సీబీఐకి ఈడీ లేఖ రాసింది.

మనీ లాండరింగ్ కోణంలో ఇప్పటివరకు ఈడీ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే.అక్రమాలకు పాల్పడ్డారన్న కోణంలో దర్యాప్తు చేయాలంటూ ఈడీ లేఖలో పేర్కొంది.

పలు కంపెనీలు తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.విదేశాలకు గ్రానైట్ తరలింపులో అవినీతి జరిగినట్లు ఈడీ గుర్తించింది.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి రూ.800 కోట్లు గండి కొట్టారని నిర్ధారించింది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు