పీఎఫ్ఐ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం

పీఎఫ్ఐ కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.జాతీయ దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారంతో పీఎఫ్ఐ ఫండ్స్ పై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ నేపథ్యంలో గల్ఫ్‎లోనూ వేల సంఖ్యలో పీఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించారు.విదేశాల్లోనూ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేసి.

ఫండ్స్ ను భారత్‎లో ఉన్న పీఎఫ్ఐ కార్యకర్తలకు హవాలా ద్వారా ట్రాన్స్‎ఫర్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.రూ.120 కోట్లకు సంబంధించి ఈడీ కూపీ లాగుతోంది.ప్రపంచ వ్యాప్తంగా తేజస్ పేపర్‎ను నడిపిస్తున్న పీఎఫ్ఐ.

తేజస్ కు వచ్చిన డొనేషన్ అంటూ ఫేక్ రిసిప్ట్‎లు చూపిస్తుందని తెలిపారు.ఈ క్రమంలో తేజస్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న పీఎఫ్ఐ నాయకుడు షఫిక్ ను మూడు రోజుల క్రితం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)