తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ చార్జ్ షీట్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.పల్నాడులో పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవటంతో జిల్లా ఎస్పీ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

మరోపక్క తిరుపతిలో కూడా పరిస్థితులు విధ్వంసకరంగా మారాయి.తెలుగుదేశం మరియు వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో మనీలాండరింగ్ కేసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ జెసి ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy )పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఫైల్ చేసింది.

జెసి ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు చెందిన వాహనాలకు నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కేసులో 2022లో జేసీ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం జరిగింది.

Advertisement

ఇదిలా అంటే ఏపీ పోలింగ్ ( AP Polling )రోజు నుండి తాడిపత్రిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.మంగళవారం వైసీపీ.టీడీపీ( YCP TDP ) కార్యకర్తలు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు.ఈ రాళ్లదాడిలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి.

పరిస్థితిని అదుపు చేయటానికి పోలీసులు టియార్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ ఆస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది.

గత ఎన్నికలలో కూడా పోటీ చేసే ఓటమి పాలయ్యారు.దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని ఆస్మిత్ రెడ్డి.

ప్రచార కార్యక్రమాలలో బాగా కష్టపడ్డారు.మరి ఈసారి తాడిపత్రిలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Shocking Facts About Money Plant I Mana Health
Advertisement

తాజా వార్తలు