ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఈడీ దూకుడు

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది.ఏక‌కాలంలో దేశ‌వ్యాప్తంగా 32 చోట్ల ఈడీ దాడులు నిర్వ‌హించింది.

ఇటు తెలంగాణ‌లో హైద‌రాబాద్ లో ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసింది.సీబీఐ కేసులో ఏ-14గా ఉన్న అరుణ్ రామ‌చంద్ర పిళ్లై నివాసంలో అధికారులు త‌నిఖీలు చేశారు.

అయితే, రామచంద్ర పిళ్లైతో తెలంగాణ‌లోని ప‌లువురు ప్ర‌ముఖుల‌తో సంబంధాలు ఉన్నాయి.ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో ఉన్న వ్యాపార లావాదేవీల‌పై ఈడీ ఆరా తీస్తోంది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు