వైయస్ షర్మిలకు ఈసీ నోటీసులు..!!

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు( YS Sharmila ) ఈసీ నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో వివేక హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు,( Malladi Vishnu ) అవినాష్ రెడ్డి( Avinash Reddy ) ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.

దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని షర్మిలకు ఈసీ నోటిసులు( EC Notices ) జారీ చేసింది.లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఏపీలో ఎన్నికలకు ఇంకా పాతిక రోజులు మాత్రమే సమయం ఉంది.మే 13వ తారీకు పోలింగ్ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే ఈసారి కాంగ్రెస్ పుంజుకుంది.

Ec Notices For Ys Sharmila Details, Ec, Congress, Ys Sharmila, Ys Sharmila Ec N
Advertisement
EC Notices For YS Sharmila Details, EC, Congress, YS Sharmila, Ys Sharmila Ec N

విభజన జరిగిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని( Congress Party ) ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.కానీ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవల వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది.గత పది సంవత్సరాల కంటే ఈసారి ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉంటే జరగబోయే ఎన్నికల్లో కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తూ ఉంది.రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగాలు చేస్తున్నారు.

అయితే వైఎస్ వివేకానంద హత్య కేసు ప్రస్తావించొద్దని నిన్న కడప కోర్టు పేర్కొంది.అయినా గాని షర్మిల ప్రస్తావించటంతో.ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.

దీంతో ఈసీ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని షర్మిలకి నోటీసులు జారీ చేసింది.

ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !
Advertisement

తాజా వార్తలు