అల్లం ఎక్కువగా తింటే ఈ ప్రమాదాలు రావచ్చు...

మన భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో చేసే వంటకాలలో అల్లాన్ని కచ్చితంగా ఉపయోగిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ అల్లాన్ని ఉపయోగించని ఇల్లు అంటూ అసలు ఉండదు.

ఎందుకంటే అల్లం వంటకాలలో రుచిని పెంచడమే తో పాటు అనారోగ్య సమస్యలను రాకుండా చేస్తుంది.అందుకే చాలామంది ప్రజలు అల్లాన్ని తేనీటిలో కూడా వినియోగిస్తారు. అల్లం చాయ్, మసాలా చాయ్ వంటి డ్రింక్స్ చేసుకొని ప్రజలు వర్షాకాలంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు.

అల్లం అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.అందుకే చాలామంది ప్రతిరోజూ అల్లాన్ని నేరుగా కూడా తీసుకుంటూ ఉంటారు.

కానీ అల్లం రోజు తింటూ ఉంటే కచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.అల్లం ఎక్కువగా తీసుకుంటే రక్తస్రావం జరగవచ్చు.

అల్లాన్ని ఎక్కువగా తినే వారిలో గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.రక్తపోటు వ్యాధి ఉన్నవారు అల్లం తీసుకోవడం వారి ఆరోగ్యాలకు అస్సలు మంచిది కాదు.

ఆహార పదార్థాలలో అధికంగా అల్లం ఉపయోగిస్తే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి చెడు ప్రభావాల తో ఆరోగ్యం దెబ్బతింటుంది.అల్లాన్ని ఖాళీ కడుపు తో తినడం వల్ల కడుపు నొప్పి కూడా రావచ్చు.

కొందరిలో అల్లం తీసుకోవడం వల్ల ఓరల్ అలర్జీ కూడా వస్తుంది.ఇది వచ్చినప్పుడు నోట్లో దురదగా చికాకుగా ఉంటుంది.

పరిమితికి మించిన అల్లాన్ని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండాలంటే అల్లం తక్కువగా ఉపయోగించడమే మేలు అని వైద్యులు సలహా ఇస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఈ అల్లాన్ని ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు వచ్చే అవకాశం కూడా ఉంది.ఈ అల్లం ప్రేగుల ద్వారా ఆహారం మల ప్రవాహాన్ని వేగం చేస్తుంది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

కాబట్టి మన కడుపులో అలజడి రేగి తీవ్రమైన అలసట వల్ల బలహీనంగా ఉంటుంది.

తాజా వార్తలు