రోజూ ఈ గింజలు తింటే మీ కంటి చూపు రెట్టింపు అవుతుంది.. తెలుసా?

ఇటీవల కాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కోట్లాది మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.ముఖ్యంగా చాలామందిలో కంటి చూపు మందగిస్తుంది.

ఫోన్, లాప్ టాప్, టాబ్లెట్, టీవీ వంటి స్మార్ట్ గడ్జెట్స్ ను అధికంగా వినియోగించడం వ‌ల్ల కంటి ఆరోగ్యం తీవ్రంగా ప్ర‌భావితం అవుతోంది.అలాగే ఆహారపు అలవాట్లు, పోషకాలు కొరత, అధిక ఒత్తిడి తదితర కారణాల వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది.

ఏదేమైనా చూపు త‌గ్గ‌డం వల్ల కళ్లద్దాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే గింజలను తీసుకోండి.రోజు ఈ గింజలను తింటే మీ కంటి చూపు రెట్టింపు అవుతుంది.మరి ఇంతకీ ఆ గింజలు ఏంటి.

Advertisement

వాటిని ఎలా తీసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపు గింజలు( Fennel seeds ).ఇవి జీర్ణ సమస్యలను దూరం చేయడానికి మాత్రమే సహాయపడతాయని ఎక్కువ శాతం మంది భావిస్తుంటారు.కానీ పోషకాల నిలయమైన సోంపు గింజలు ఆరోగ్యపరంగా మరెన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా సోంపు గింజల్లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.మ‌రి వీటిని ఎలా తీసుకుంటే కంటి చూపు పెరుగుతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల సోంపు గింజలు వేసి 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు బాదం పప్పు( Almonds ) వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న సోంపు గింజలు మరియు బాదం పప్పు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

ఈ పౌడర్ ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఇక నైట్ నిద్రించడానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న సోంపు బాదం పొడితో పాటు వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) కలిపి తీసుకోవాలి.

Advertisement

ఇలా నిత్యం కనుక చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది.కళ్ళు నీరు కారడం, కళ్ళు ఎర్రబడడం వంటి సమస్యలు ఉన్న సరే దూరం అవుతాయి.కంటి సంబంధిత వ్యాధులు సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

తాజా వార్తలు