చేపలు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా తింటే మాత్రం చాలా డేంజర్ అని తెలుసా?

సీ ఫుడ్ లో చేపలు ( Fish )ఒకటి.చాలా మందికి చేపలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది.

వారానికి ఒక్కసారి అయినా చేపలు తింటుంటారు.చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి.

అలాగే చేపలను అనేక విధాలుగా వండుతుంటారు.చేపల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్‌ ఇలా అన్ని రకాల పోషకాలు నిండి ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా చేపలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Advertisement

వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేపలను తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.వయసు పైబడినా మతిమరుపు దరిచేరకుండా ఉంటుంది.ఎముకలు మ‌రియు దంతాల దృఢత్వానికి, రక్తహీనతను తరిమి కొట్టడానికి, గుండె ఆరోగ్యానికి చేపలు తోడ్పడతాయి.

అయినప్పటికీ చేపలు తినే సమయంలో కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తే చాలా డేంజర్ అవుతుంది.ముఖ్యంగా చేపలతో పాటు కొన్ని ఆహారాలను అస్సలు తీసుకోకూడదు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చేపలు మరియు సిట్రస్ పండ్లు( Citrus fruits ) ఒకేసారి తినకూడదు.లేదా ఒకదాని వెంటనే ఒకటి తినకూడదు.ఈ రెండిటి కాంబినేషన్ ఎంతో ప్రమాదకరమైనది.

చేపలు, సిట్రస్ పండ్లు ఒకే టైంలో తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యే రిస్క్ ఉంటుంది.అలాగే చేపలతో పాటు పాలు, పెరుగు ఇతర పాల ఉత్పత్తులను పొరపాటున కూడా తీసుకోకూడదు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ లో ప్రోటీన్ ఉంటుంది.చేపల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది.

Advertisement

అధిక ప్రోటీన్ ఒకేసారి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరుపై ప్రభావం పడుతుంది.దాంతో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి,( Stomach Pain ) గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

చాలామంది చేపల కూరను స్పైసీగా తయారు చేసుకుని తీసుకుంటారు.కానీ ఓవర్ స్పైసీగా తీసుకుంటే స్టమక్ అల్సర్, కడుపులో మంట వంటివి తలెత్తుతాయి.

ఇక అధిక ప్రాసెసర్ చేసిన లేదా వేయించిన ఆహారాలతో చేపలను కలిపి తినకూడదు.అలా చేస్తే చేపల్లో పోషకాలు, నాణ్యత తగ్గిపోతాయి.

తాజా వార్తలు