గురువారం రోజు ఈ పండును తింటే శ్రీహరి ఆగ్రహానికి గురవుతారు జాగ్రత్త..!

2023 అధిక శ్రావణమాసం నెలలో చివరి గురువారం( Thursday ) పూజ ఆగస్టు 10వ తేదీన జరగనుంది.

శ్రీ మహావిష్ణువు బృహస్పతికి ప్రీతికరమైన గురువారం రోజు శ్రీహరిని పూజించి ఉపవాసం ఉండడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.

అలాగే జాతకంలో బృహస్పతి బలంగా మారుతాడు.గురువారం వ్రతం ఆచరించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

అయితే కొన్ని పనులు గురువారం చేయకూడదని పండితులు చెబుతున్నారు.

గురువారం రోజు ఈ పనులు చేయడం వల్ల గురు దోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.గురువారం రోజు మనం చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం రోజు ఉపవాసం లేదా పూజ చేస్తుంటే అరటి పండ్లు తినకూడదని గుర్తుపెట్టుకోవాలి.

Advertisement

ఎందుకంటే విష్ణువు అరటిపండు( Banana )ను ఇష్టపడతారు.దీనితో పాటు గురువారం అరటి చెట్టును పూజించే సాంప్రదాయం కూడా ఉంది.

ఈ రోజు మీరు పేదలకు అరటి పండ్లను దానం చేయవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే గురువారం విష్ణువు( Lord Vishnu )కు ఎంతో ఇష్టమైన రోజు.ఈ రోజు మీరు షాంపూతో లేదా సబ్బు తో తలస్నానం చేయకూడదు.ఈ రోజు జుట్టు మాత్రమే కాకుండా శరీరాన్ని కూడా సబ్బు లేదా షాంపుతో శుభ్రం తోమకుడదు.

ముఖ్యంగా మహిళలు ఈ రోజు తల స్నానం అస్సలు చేయకూడదు.గురువారం రోజు తల స్నానం( headbath ) చేయడం వల్ల ఐశ్వర్యం లోపిస్తాయని పెద్దవారు చెబుతారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్24, మంగళవారం 2024

బృహస్పతి బలం పొందాలంటే మీరు గురువారం జుట్టు కత్తిరించకూడదు.ఈ రోజున మగవారు గడ్డం కూడా గీయకూడదు.

Advertisement

మీరు గురువారం ఈ తప్పులు చేస్తే మీరు గురు దోషాన్ని జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.గురువారం రోజు మీరు ఎవరికి రుణం( Loan ) ఇవ్వకూడదు.

ఎవరి దగ్గర రుణం తీసుకోకూడదు.అంతే కాకుండా గురువారం రోజు డబ్బుకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు.

ఈ రోజు ఋణం తీసుకోవడం వల్ల వడ్డీ ఎక్కువ కాలం కట్టవలసి వస్తుంది.అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాకపోవచ్చు.

తాజా వార్తలు