ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం:పల్లపు దుర్గయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ): జిల్లా కలెక్టర్ కు బీజే‌పి ఓబీసీ మోర్చా( OBC Morcha ) ఆధ్వర్యంలో పలు సమస్యలపై మెమోరాండం అందించే కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించడం అప్రజాస్వామికమని బీజేపీ రామన్నపేట మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య అన్నారు.

అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసి ప్రజల సమస్యలను బయటకు తెలియజేయకుండా చేస్తున్నారని, గత కొన్ని నెలలుగా బీజేపీ కార్యకర్తలను ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఖండించారు.

అరెస్టు చేసిన వారిలో ఒబిసి మోర్చా మండల అధ్యక్షుడు రాపోలు నరేష్,సీనియర్ నాయకులు గురుకుల సైదులు తదితరులు ఉన్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable

Latest Video Uploads News