దసరాలో రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ పూజలు..! ఎక్కడంటే..?

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే దసరా( Dasara Festival ) అని అంటారు.

లేదా విజయదశమి ( Vijayadashami )అని కూడా అంటారు.

అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన దసరా జరుపుకుంటున్నారు.అయితే హిందూ మతంలో దసరా పండుగ జరుపుకోవడానికి కొన్ని భిన్నమైన కథలు వాడుకలో ఉన్నాయి.

ఈ పండుగ రావణుడి లంకపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా, రావణుని మరణానికి సంబంధించినదిగా నమ్ముతారు.అయితే త్రేతాయుగంలో అశ్వియుజ శుక్లపక్షం పదవ రోజున రావణుడిని వధించిన రాముడు సీతను అతని బారి నుండి విడిపిస్తారు.

ఈ సంతోషంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో రావణ దహనాన్ని చేపడతారు.

Dussehra Mourning The Death Of Ravana Where , Vijayadashami , Lord Rama , Asvi
Advertisement
Dussehra Mourning The Death Of Ravana Where , Vijayadashami , Lord Rama , Asvi

కానీ కొన్నిచోట్ల మాత్రం రావణుడి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.అయితే రామునికి బదులుగా రావణుడిపై తమ భక్తిని ప్రజలు చాటుతున్నారు.అయితే ఆ గ్రామం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ విశ్వాసం ప్రకారం రాజస్థాన్ లోని జోధ్ పూర్ జిల్లాలోని మండోర్ లో రావణుడు, మండోదరిని వివాహం చేసుకున్నాడు.శ్రీమాలీ కమ్యూనిటీకి చెందిన గోదా గోత్ర ప్రజలు రావణుడి కళ్యాణ ఊరేగింపులో ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్లలేదని, అప్పటినుంచి ఇప్పటివరకు ఇక్కడే స్థిరపడి ఉన్నారని నమ్ముతారు.

అయితే ఇక్కడ నివసించే శ్రీమాలీ కమ్యూనిటీ ప్రజలు తమను తాము రావణుడి వారసులమని భావిస్తూ ఉంటారు.అయితే రావణుడు, మండోదరిని ఆరాధిస్తారు.

Dussehra Mourning The Death Of Ravana Where , Vijayadashami , Lord Rama , Asvi

అటువంటి పరిస్థితిలో దసరా రోజున రావణా దహనం( Ravana )లో పాల్గొనడానికి బదులుగా ఈ తెగకు చెందిన ప్రజలు రావణాసుర మృతికి సంతాపం తెలుపుతారు.ఇక కర్ణాటకలోని మాండ్య, కోలార్ లో కూడా రావణుడికి వధను చేయరు.పైగా రావణాసురుడిని పూజిస్తారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

ఎందుకంటే అక్కడ నివసించే ప్రజలు రావణుడు శివ భక్తుడు ( Devotee of Shiva )అని అందుకే అతన్ని కాల్చకూడదని, అతన్ని పూజించాలని విశ్వసిస్తారు.అందుకే దసరా రోజున ఇక్కడ ప్రజలు పూర్తి నియమ, నిష్ఠలతో రావణుడిని పూజిస్తారు.

Advertisement

ఇక హిందూ విశ్వాసం ప్రకారం ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్( Gautam Buddha Nagar ) సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామంలో కూడా రావణుడిని పూజిస్తారు.అయితే ఆ గ్రామం రావణుడి జన్మస్థలంగా పరిగణించబడింది.

అలాంటి పరిస్థితిలో స్థానిక ప్రజలు దసరా పండుగను జరుపుకోకుండా ఉంటారు.ఇదే విధంగా చాలా గ్రామాలలో రావణాసురుడిని పూజిస్తారు.

తాజా వార్తలు