లొంగలేదని ఇంట్లోకి పాములు వదిలారంటున్న కత్తి కార్తీక!

బుల్లితెర న్యూస్ ఛానెళ్లలో ఒకటైన వీ6 ఛానెల్ లో దిలె సే కార్తీక ప్రోగ్రామ్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కత్తి కార్తీక.

ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న కత్తి కార్తీక హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీని ఇచ్చింది.

ఆ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో కత్తి కార్తీక పాపులారిటీని పెంచుకుంది.తెలంగాణ యాసలో గలగలా మాట్లాడటం ఆమెకు ప్లస్ అయింది.

Dubbaka Independet Mla Kathi Kartheeka Sensational Comments Dubbaka Bie Electio

లండన్ లో అర్కిటెక్చర్ చదివిన కత్తి కార్తీకకు బంజార హిల్స్ లో ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియో ఉంది, బిగ్ బాస్ షో తరువాత పెద్దగా వార్తల్లో నిలవని కత్తి కార్తీక కొన్ని రోజుల క్రితం దుబ్బాక బై ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ వార్తల్లో నిలిచింది.అనంతరం ఒక భూ వివాదంలో ఆమెపై కేసు నమోదైందంటూ ప్రచారం జరిగింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కత్తి కార్తీక మాట్లాడుతూ దుబ్బాక బై ఎలక్షన్ లో పోటీ చేస్తానంటే అక్కడ పోటీ నుంచి తప్పుకోవాలని తనను ప్రలోభపెట్టారని చెప్పారు.దొరల పాలనను అంతం చేయడానికే తాను పోటీ చేశానని అన్నారు.

Advertisement

గతంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయని అయితే దుబ్బాక ఎన్నికల్లో మహిళా నేతలు పోటీ చేయలేదని.తాను అక్కడ తొలిసారి పోటీ చేసి మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టించానని తెలిపారు.

తాను జనంలోకి బహుజన వాదాన్ని తీసుకువెళతానని అన్నారు.ఎన్ని విధాలుగా బెదిరించినా లొంగకపోవటంతో ఆఖరికి తన ఇంట్లో పాములను కూడా వదిలారని కత్తికార్తీక అన్నారు.

దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధిస్తానని నమ్మకం ఉందని తెలిపారు.తనలో పోరాట పటిమ ఉందని ప్రజల్లో మాట తప్పని నాయకురాలిగా నిలవాలనే కోరిక ఉందని ఆమె అన్నారు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు