భారత్‎కు మరోసారి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ తరలింపు..!

పాకిస్థాన్ నుంచి భారత్ కు మరోసారి డ్రోన్ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలు తరలించడాన్ని అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలోనే మూడు రోజుల్లో 30 కిలోల హెరాయిన్, ఆయుధాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

పంజాబ్ సరిహద్దు జిల్లాల్లోకి చైనా డ్రోన్లతో డ్రగ్స్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది.నిన్న అమృతసర్ జిల్లాలో డ్రగ్స్ తరలిస్తున్న డ్రోన్ ను కూల్చివేసి, ఐదు కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈనెల 3న పంజాబ్ లోని ఫజిల్కా జిల్లా చురివాలా చుస్తీలో డ్రగ్స్, ఆయుధాల తరలింపును బీఎస్ఎఫ్ భగ్నం చేసిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా 25 కిలోల హెరాయిన్, పిస్టల్, రెండు మ్యాగజైన్లతో పాటు 50 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement