న్యూఇయర్ వేళ హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టివేత

న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి.ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన సోదాలలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది.

ఈ క్రమంలోనే ముగ్గురు డ్రగ్స్ సప్లయర్లను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.15 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు రాజస్థాన్ నుంచి డ్రగ్స్ ను అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించారు.ఇప్పటికే ఈ ముఠా పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా న్యూ ఇయర్ వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపడున్నారు.డ్రగ్స్ ను అరికట్టేందుకు రంగంలోకి దిగిన అధికారులు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు