భారత్ - పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం

భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో డ్రోన్ కలకలం సృష్టించింది.

పాక్ నుంచి పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోకి ప్రవేశించిన డ్రోన్ పై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు.

అనంతరం డ్రోన్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.వీటిలో నాలుగు చైనా మేడ్ పిస్టల్స్, ఎనిమిది మ్యాగ్ జైన్లతో పాటు సుమారు 40 లైవ్ రౌండ్లను కూడా బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు.

అయితే గతంలో కూడా పాక్ డ్రోన్ల ద్వారా ఆయుధాలను సరిహద్దు దాటించే ప్రయత్నం చేయగా.బీఎస్ఎఫ్ దానిని భగ్నం చేసిన విషయం తెలిసిందే.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement