Drushyam 3 Mohan Laal : ఈ దెబ్బతో దృశ్యం 3 మరింత స్పీడ్‌.. అన్ని చోట్ల అదే ఆతృత

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన దృశ్యం మరియు దృశ్యం 2 సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ రెండు సినిమా లను కూడా తెలుగు మరియు హిందీ లో రీమేక్ చేయగా అక్కడ ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

ఇటీవల దృశ్యం 2 హిందీ రీమేక్ తెలుగు ప్రేక్షకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ ఎత్తున కలెక్షన్స్ నమోదు చేస్తూ దూసుకు పోతుంది.

మొదటి రోజే ఏకంగా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం తో బాలీవుడ్ లో సరి కొత్త జోష్ కనిపిస్తోంది.ఈ మధ్య కాలం లో ఏ ఒక్క సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసిన దాఖలాలు లేవు.

ఇలాంటి సమయం లో దృశ్యం 2 హిందీ వర్షన్ ఏకంగా 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం తో చిత్ర యూనిట్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో దృశ్యం 3 సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే మలయాళం లో మోహన్‌ లాల్ ఆ మూడవ పార్ట్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.ఎప్పుడైతే అక్కడ విడుదలై సక్సెస్ అవుతుందో వెంటనే తెలుగు మరియు హిందీలో రీమేక్‌ చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారు.

హిందీ లో దృశ్యం ను అజయ్ దేవగన్ మరియు శ్రియ లు చేస్తున్న విషయం తెలిసిందే.తెలుగు లో వెంకటేష్ మరియు మీనా లు నటించగా మలయాళం లో మోహన్ లాల్ మరియు మీనా నటించారు.

మొత్తానికి ఈ సినిమా ఏ భాష లో విడుదలైనా కూడా దృశ్యం అన్ని చోట్ల భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అందుకే మూడవ పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు