వర్షాకాలంలో టీ కాఫీలకు బదులు రోజు ఉదయం ఈ వాటర్ తాగితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.

జలుబు, దగ్గు( Cold, cough ) వంటి సీజనల్ వ్యాధులతో పాటు విష జ్వరాల వ్యాప్తి అనేది చాలా అధికంగా ఉంటుంది.అందుకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి.

ఇకపోతే వర్షాకాలంలో ఉదయం లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.అయితే టీ, కాఫీలకు( tea, coffee ) బదులు ఇప్పుడు చెప్పబోయే వాటర్ తాగితే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.

మరి ఇంతకీ ఆ వాటర్ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు( Garlic cloves ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక వెల్లుల్లి తురుము వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వెల్లుల్లి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం( lemon juice ) కలిపి తీసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజూ కనుక చేశారంటే రోగ నిరోధక వ్యవస్థ ( Immune system )బలపడుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సీజనల్ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.

ఒకవేళ ఆల్రెడీ ఆ సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి విముక్తి లభిస్తుంది.

ఢిల్లీలో కాదు గల్లికి రా జగన్ .. టిడిపి సవాల్ 
ఎదిగే పిల్ల‌ల‌కు త‌ప్ప‌కుండా ఇవ్వాల్సిన ఫుడ్ ఇదే!

అలాగే వెల్లుల్లి వాటర్ ను రోజు ఉదయం తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్( bad cholesterol ) కరుగుతుంది.రక్త సరఫరా సాఫీగా సాగుతుంది.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు వెల్లుల్లి వాటర్ మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

Advertisement

వెయిట్ లాస్ కు మద్దతు ఇస్తుంది.అధిక రక్తపోటును అదుపులోకి తెస్తుంది.

మరియు ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం ఈ వాటర్ దూరం చేస్తుంది.

తాజా వార్తలు