టీ, కాఫీల‌కు బ‌దులు నిత్యం ఉదయం ఈ జ్యూస్ తాగారంటే రోగాలన్నీ పరార్ అవ్వాల్సిందే!

ఉదయం వేళ టీ, కాఫీ( Tea, coffee) వంటివి తాగడానికే ఎక్కువ శాతం మంది మక్కువ చూపుతుంటారు.

ఉదయం లేవగానే ఒకసారి మరియు బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒకసారి టీ లేదా కాఫీ తీసుకునే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.

అయితే టీ, కాఫీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అన్న‌ది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మాత్రం మీ ఆరోగ్యానికి అండగా నిలబడుతుంది.

నిత్యం ఉదయం ఈ జ్యూస్ ను తాగితే అనేక రోగాలు పరారవుతాయి.మరి లేటెందుకు ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Drinking This Juice Regularly Is Very Good For Health Beetroot Cucumber Juice,

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు పీల్ తొలగించిన కీరా దోసకాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement
Drinking This Juice Regularly Is Very Good For Health! Beetroot Cucumber Juice,

ఈ బీట్ రూట్ కీరా జ్యూస్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.

Drinking This Juice Regularly Is Very Good For Health Beetroot Cucumber Juice,

నిత్యం ఈ జ్యూస్ ను తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.ఈ బీట్ రూట్ కీరా జ్యూస్ లో పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి.ఈ పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.అలాగే ఈ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్ అవుతుంది.ఈ బీట్‌రూట్ కీరా జ్యూస్ లో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉంటాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఇవి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌రిమికొట్ట‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే ఈ జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో తోడ్ప‌డ‌తాయి.

Advertisement

అంతేకాదు నిత్యం ఉద‌యం బీట్ రూట్ కీరా జ్యూస్ ను తాగితే బ్రెయిన్ సూప‌ర్ షార్ట్ గా ప‌ని చేస్తుంది.ఆలోచ‌నా శ‌క్తి, ఏకాగ్రత రెట్టింపు అవుతాయి.

పొట్ట చుట్టూ కొవ్వు క‌రుగుతుంది.అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి సైతం బ‌య‌ట‌ప‌డ‌తారు.

తాజా వార్తలు