ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? అయితే మీరు ఈ సమస్యలో పడినట్టే..

ఈ మధ్యకాలంలో చాలామందికి ఒత్తిడి( Stress ) కారణంగా ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంటుంది.

అయితే బెడ్ కాఫీ తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

కానీ దీనివల్ల లాభాల కంటే ఆనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.మరి బెడ్ కాఫీ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే ఏమీ తీసుకోకుండా కేవలం టీ తాగడం వలన ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి.ఇవి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి.

అందుకే ఏదైనా కూడా మోతాదుకు మించి తీసుకుంటే అంత మంచిది కాదు.అలాగే టీ కూడా అవసరం ఉన్నంతవరకు మాత్రమే తాగాలి.

Advertisement
Drinking Tea On An Empty Stomach? But If You Are In This Problem , Acidity , T

అతిగా తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.ఇక మరి ముఖ్యంగా పరిగడుపున ఒక్క కప్పు తీ తాగిన అనేక వ్యాధులకు గురవుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే టీ లేదా కాఫీ లో ఆమ్లం అనే పదార్థం ఉంటుంది.సహజంగానే ఇది మన శరీరంలో ఉంటుంది.

Drinking Tea On An Empty Stomach But If You Are In This Problem , Acidity , T

అయినప్పటికీ పరిగడుపున టీ తాగడం వలన దీని పరిమాణం పెరిగి ఎసిడిటీ( Acidity )కీ దారితీస్తుంది.అంతేకాకుండా నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది.ఇక ఖాళీ కడుపుతో టీ తాగితే డిహైడ్రేషన్ కు కూడా గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇక టీ లో ఉండే పదార్థాలు శరీరంలో మూత్రస్థాయిని కూడా పెంచుతాయి.

దీని వలన శరీరంలోని నీరంతా బయటకు పోతుంది.అలాగే ఇది నిర్జిలీకరణ సమస్యకు దారితీస్తుంది.అంతేకాకుండా పరిగడుపున టీ తాగితే జీర్ణ క్రియ క్షీణిస్తుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

ఇలా జీర్ణవ్యవస్థ( Digestive system ) దెబ్బ తినడం వలన శరీరంలో శక్తి నశించిపోతుంది.దీంతో ఎల్లప్పుడూ అలసిపోయినట్లు కనిపిస్తారు.

Drinking Tea On An Empty Stomach But If You Are In This Problem , Acidity , T
Advertisement

ఇక ఆ తర్వాత జ్వరం తదితర వ్యాధులు వచ్చే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.ఇక టీ ఎక్కువగా తాగడం వలన మలబద్ధకం లాంటి సమస్య కూడా ఏర్పడుతుంది.అంతేకాకుండా నిద్రలేమి సమస్య( Insomnia ), బరువు పెరగడం, ఆకలి మందగించడం, రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి.

అయితే మొత్తానికి టీ ని దూరం చేయకుండా మోతాదుకు మించి తీసుకోకపోవడమే మంచిది.అలాగే కేవలం టీ కాకుండా టీ తో పాటు బిస్కెట్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

తాజా వార్తలు