టీ, కాఫీలు త్రాగుతూ పొగ త్రాగడం గుండెకు చాలా ప్రమాదమ...

ప్రతి రోజు ఉదయాన్నే వేడి వేడి టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించడం మనలో చాలా మందికి అలవాటు.

కొందరికి అయితే కాఫీ తాగనితే వారు ఏ పని కూడా చేయరు.

దాదాపు ఓ వ్యసనంగా మన జీవితాల్లో ఇవి భాగమైపోయాయి.తాజా పరిశోధనల ప్రకారం కాఫీ, టీలలోని కెఫిన్ మనల్ని వాటికి బానిసలుగా మారుస్తుంది.

ఆఫీసు, ఇల్లు ఎక్కడున్నా, టైంకి చేతిలో కప్పులేకపోతే చిరాకు అనిపిస్తుంది.ఐతే చాలా మందికి కాఫీ తాగుతూ సిగరేట్‌ పొగ కాల్చే అలవాటు ఉంటుంది.

ఈ విధంగా కాఫీ తాగుతూ, పొగ పీల్చితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాఫీతో పాటు పొగ తాగే అలవాటు ఉన్నవారు తరచుగా డీహైడ్రేషన్‌కు గురవుతారు.

Advertisement

శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే పెదవులు, మెడపై నల్లగా ఏర్పడుతుంది.కళ్ల కింద నల్లటి వలయాలు కూడా కనిపిస్తాయి.

అంతేకాకుండా కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా వస్తుంది.కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు తరచుగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంటారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

కాఫీ లో ఉండే కెఫిన్ మన నిద్ర రాకుండా చేస్తుంది.ప్రతి రోజూ మంచి నిద్ర పట్టాలంటే, కాఫీని తక్కువ పరిమాణంలో తీసుకోవాలనే విషయం మర్చిపోకూడదు.

వైద్య నిపుణుల ప్రకారం టీ లేదా కాఫీలోని కెఫిన్ జీర్ణ వ్యవస్థ ను దెబ్బతీసే అవకాశం ఉంది.కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిన్ హార్మోన్లు విడుదలవుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

ఇవి పెద్దపేగు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి.కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది.కాఫీని ఎక్కువగా తీసుకునేవారికి అధిక రక్తపోటు సమస్య మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisement

అధిక రక్తపోటు కణాలను ప్రభావితం చేస్తుంది.ఫలితంగా గుండెపోటు కూడా రావచ్చు.

తాజా వార్తలు