బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పని చేయాలంటే ఈ జ్యూస్ తాగండి..!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే బ్రెయిన్( Brain ) ఎంత వేగంగా పనిచేయాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

శరీరం అన్న‌ యంత్రం సజావుగా పనిచేయాలంటే మెదడు ఆరోగ్యంగా చురుగ్గా ఉండడం తప్పనిసరి.

కానీ ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ధూమపానం, మద్యపానం తదితర అంశాలు మెదడును మొద్దుబారేలా చేస్తాయి.ఫలితంగా జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి లోపించడం ప్రారంభమవుతాయి.

అయితే ఈ సమస్యల‌కు దూరంగా ఉండాలనుకున్నా, బ్రెయిన్ ను సూపర్ షార్ప్ గా మార్చుకోవాలనుకున్నా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తప్పకుండా డైట్ లో తెచ్చుకోండి.జ్యూస్ తయారీ కోసం బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు బీట్ రూట్ ముక్కలు( Beet root slices ), అరకప్పు క్యారెట్ ముక్కలు( Carrot slices ), అరకప్పు యాపిల్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే నాలుగు ఫ్రెష్ పాలకూర ఆకులు( Lettuce leaves ), మూడు లేదా నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.దాంతో మన జ్యూస్ అనేది రెడీ అవుతుంది.

Advertisement
Drink This Juice To Make Your Brain Work Super Sharp! Sharp Brain, Brain, Health

ఈ యాపిల్ క్యారెట్ బీట్ రూట్ పాలకూర జ్యూస్ నేరుగా తాగవచ్చు.లేదా ఫిల్టర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు.

Drink This Juice To Make Your Brain Work Super Sharp Sharp Brain, Brain, Health

యాపిల్ క్యారెట్ బీట్ రూట్ పాలకూర జ్యూస్ లో ఉండే నైట్రేట్స్ మెదడు రక్త ప్రసరణను మెరుగుపరచి మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తాయి.మెద‌డును చురుగ్గా మారుస్తాయి.స్ట్రెస్, ఆందోళనను తగ్గించడంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

వారానికి క‌నీసం రెండు సార్లు ఈ జ్యూస్ ను తాగితే జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.అలాగే బీట్‌రూట్, పాలకూరలో ఉండే ఐరన్, ఫోలేట్ రక్తహీనత సమస్యను తగ్గించి హేమోగ్లోబిన్‌ను పెంచుతుంది.

క్యారెట్‌లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి.

Drink This Juice To Make Your Brain Work Super Sharp Sharp Brain, Brain, Health
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

యాపిల్‌లోని ఫైబర్, పాలిఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.పాలకూరలో ఉండే విట‌మిన్స్‌, మినరల్స్ శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.బీట్‌రూట్ న్యాచురల్ డిటాక్సిఫయర్‌గా పని చేస్తుంది, లివర్‌ను శుభ్రంగా ఉంచుతుంది.

Advertisement

శరీరంలో విషతత్వాలను తొల‌గిస్తుంది.కాబ‌ట్టి, మాన‌సిక ఆరోగ్యంతో పాటు శారీర‌క ఆరోగ్యాన్ని పెంచుకోవాల‌నుకుంటే త‌ప్ప‌కుండా పైన చెప్పుకున్న జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

తాజా వార్తలు