హెడ్ లైన్స్ కోసం విడాకుల విషయం సాగ తీయడం తప్పు: నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య( Nagachaitanya ) ప్రస్తుతం కస్టడీ సినిమా( Custody ) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నటువంటి నాగచైతన్య తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా తెలియజేస్తున్నారు.

అయితే మొదటిసారి సమంత ( Samantha ) తో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను కూడా నాగచైతన్య తెలియజేశారు.సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కారణంగా ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయని ఆ గొడవలు పెరిగి పెద్దవి కావడంతోనే విడాకులు తీసుకొని విడిపోయామంటూ తన విడాకులకు గల కారణాలను తెలియజేశారు.

ఇలా నాగచైతన్య సమంత విడిపోయినప్పటికీ తరచూ వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఈ క్రమంలోనే నాగచైతన్య విడాకులు( Divorce ) వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.అనంతరం నాగచైతన్య వ్యాఖ్యలపై సమంత పరోక్షంగా స్పందిస్తూ మనమంతా ఒక్కటే కానీ అహంకారం భయం అనేవి మనల్ని దూరం చేస్తాయి.

అంటూ ఒక పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక తాజాగా మరోసారి నాగచైతన్య విడాకుల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ విడాకులు ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ తమ హెడ్ లైన్స్ కోసం ఇప్పటికీ మావిడాకుల విషయాన్ని సాగదీస్తూనే ఉన్నారని అది పూర్తిగా తప్పు అంటూ ఈ సందర్భంగా మరోసారి విడాకుల గురించి స్పందిస్తూ నాగచైతన్య చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల గురించి ఈయన మాట్లాడుతూ సినిమాలు విడుదలైన తర్వాత ఆ సినిమాకు ఎలాంటి రివ్యూస్ ఇచ్చారు ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనే విషయాలను తాను చదువుతానని అయితే కొన్నిసార్లు నేటిజన్స్ చేసినటువంటి కామెంట్స్ కనుక చదివితే ఎందుకు బ్రతికున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు