ప్రతి పోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దు..: నాగబాబు

పొత్తు ధర్మంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.ఈ క్రమంలోనే జనసేన( Janasena ) నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

న్యూటన్ నియమాలతో నాగబాబు( Nagababu ) ట్వీట్స్ చేశారు.కొన్ని నియమాలను కొన్నిసార్లు గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు.చర్యకు ప్రతి చర్య ఉంటుందనే అర్థం వచ్చేలా నాగబాబు ట్వీట్ చేశారు.

అలాగే తాను పెట్టే ప్రతి పోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దన్నారు.కొన్నిసార్లు సమాచారం మాత్రమే పోస్ట్ చేస్తానన్న నాగబాబు ఇప్పుడు ఫిజిక్స్ లాస్ పోస్ట్ చేశానని తెలిపారు.

ఈ క్రమంలోనే రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తానని వెల్లడించారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet

తాజా వార్తలు