ఈ నెల నుంచి శ్రావణమాసం ప్రారంభం.. ఈ సమయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం కాటేయడం ఖాయం..!

జులై 17 నుండి శ్రావణమాసం( Shravanamasam ) ప్రారంభం కాబోతోంది.అయితే ఈ మాసం వచ్చిందంటే చాలు హిందూ మతంలో పండగలు వచ్చినట్లే.

ఈ నెల మొత్తం ఒక పవిత్రమైన మాసంగా హిందువులు జరుపుకుంటారు.ముఖ్యంగా ధనలక్ష్మి దేవికి( Dhanalakshmi ) ఈ మాసం ఎంతో ఇష్టమైనది.

ఈ మాసంలో లక్ష్మీదేవి భూమి పైనే నివసిస్తుందని, ఏ ఇంట్లో అయితే పవిత్రత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి వ్రతం ప్రతి ఇంట్లోనూ జరుపుకుంటారు.

ఈ వ్రతం జరుపుకున్న ఇంట్లో శుభం జరుగుతుందని అందరూ భావిస్తారు.ముఖ్యంగా శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి వ్రతం ఉండడం వలన ఇంట్లో శుభం జరుగుతుందని భావిస్తారు.

Advertisement

ఈ మాసంలో నియమనిష్టలు పాటిస్తే లక్ష్మీదేవి నట్టింట్లో కోలువుంటుంది అని పండితులు చెబుతున్నారు.అయితే శ్రావణమాసంలో వరలక్ష్మీ దేవి వ్రతం( Varalakshmi Vratam ) చేసేవారు, మాంసాహారానికి దూరంగా ఉండాలి.ముఖ్యంగా శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది.

ఈ మాసంలో వరలక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలనుకున్నవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి.శ్రావణమాసంలో మద్యం కూడా స్వీకరించకూడదు.

ఏ ఇంట్లో అయితే మద్యం తాగిన వ్యక్తులు ఉంటారు.ఆ ఇంటికి లక్ష్మీదేవి అడుగుపెట్టదు.

అలాగే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి కొలువుంటుంది.అయితే ఈ నెలరోజుల పాటు మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 100 రోజుల ఫంక్షన్ చేసుకోడానికి.. అభిమానులు ఎన్నేళ్లు వెయిట్ చేశారో తెలుసా?

శ్రావణ మాసం అంటే శుచి శుభ్రతకు చిహ్నం.

Advertisement

కాబట్టి శ్రావణమాసంలో శుచి శుభ్రత పాటిస్తేనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువుంటుంది.అలా లేనిపక్షంలో లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.కాబట్టి శ్రావణమాసంలో ఇంట్లో దుమ్ముదూరి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇక దాన ధర్మాలకు శ్రావణమాసంలో ఎంతో ప్రాశస్త్యం ఉంది.ముఖ్యంగా పేద మహిళలకు వస్త్ర దానం చేయడం వలన శ్రావణమాసంలో లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి.

అంతేకాకుండా కన్నె పిల్లలను ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం ద్వారా శుభం జరుగుతుంది.

తాజా వార్తలు