ప్రలోభాలకు లొంగొద్దు... ఎమ్మెల్సీలకు ఎన్నో విషయాలు చెప్పిన జగన్ 

ఏపీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ తనదైన శైలిలో స్పందించారు.

ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీల కు భవిష్యత్ కార్యాచరణ పై దిశ నిర్దేశం చేశారు.

శాసనసభలో వైసిపి ఎమ్మెల్యేలను కట్టడి చేసే అవకాశం ఉందని , శాసనమండలిలోనైనా గట్టిగా ప్రభావం చూపాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు.  ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దని , కేసులు పెడతామని బెదిరించినా భయపడవద్దని జగన్ సూచించారు.

ఈరోజు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించిన జగన్ అనేక కీలక సూచనలు చేశారు.  40 శాతం ప్రజలు మన వైపే ఉన్నారని , మనం చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయని , ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని జగన్ అన్నారు .

 దేశవ్యాప్తంగా ఈవీఎం లపై చర్చ జరగాలని ఈ సందర్భంగా జగన్( Ys jagan ) అభిప్రాయపడ్డారు .ఏపీలో బిజెపి , టిడిపి , జనసేన హనీమూన్ నడుస్తోందని,  వారికి మరికొంత సమయం ఇచ్చి ఆ తర్వాత పోరాడదాం అని ఎమ్మెల్సీలకు సూచించారు .అసెంబ్లీలో తమ నోరును కట్టడి చేసే అవకాశం ఉందని మండలిలో ఎమ్మెల్సీలు గట్టిగా పోరాడాలని సూచించారు.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలే వైసిపికి దక్కాయి .అయితే శాసనమండలలో 39 మంది ఎమ్మెల్సీల బలం వైసీపీకి ఉంది .త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న  నేపథ్యంలో , క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమై అనేక అంశాలపై సూచనలు చేశారు.

Advertisement

టిడిపి కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తో పాటు,  ఇతర కీలక బిళ్ళలను త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని, , గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మరికొన్ని బిల్లులను కూడా ఉపసంహరించే అవకాశం ఉందని,  అందుకే శాసనసభలో వైసిపికి బలం లేకపోయినా,  మండలి లో ఉన్న బలంతో ఆయా బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ వాటిని ప్రతిగటించాలని కోరారు  అధికార పార్టీ టిడిపి ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందాలంటే మండలిలో తగినంత బలం ఉండాలి అని,  అందుకే వైసిపి ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభ పడకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ సూచించారు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు