అధైర్యపడొద్దు అండగా ఉంటాం..నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు

అధైర్యపడొద్దు అండగా ఉంటాం- నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు - వీర్నపల్లి మండలంలో పంట పొలాల పరిశీలన.రాజన్న సిరిసిల్ల జిల్లా: అకాల వర్షం కి నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు అండగా ఉంటామని నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు.

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట, ఎర్రగడ్డ తండా, లాల్ సింగ్ తండా, వీర్నపల్లి,వన్ పల్లి, శాంతినగర్ గ్రామాల్లో అకాల వర్షానికి నష్టపోయిన రైతులను మాజీ ఎమ్మెల్యే ఊచ్చిడి మోహన్ రెడ్డి, మండల ప్రజాప్రతినిదులు, అదికారులతో కలిసి పరామర్శించారు.

క్షేత్రస్థాయిలో పంట పొలాలతో పాటు కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ మండలంలో 2000 ఎకరాల పైచిలుకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు.

Don't Get Discouraged, We Will Stand By You.. Nascab Chairman Konduru Ravinder R

నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు.కొనుగోలు కేంద్రంలో చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.

కుబేర పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా..?
Advertisement

తాజా వార్తలు