నీర‌సంగా ఉన్న‌ప్పుడు ఈ ఫుడ్స్ తింటే రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే..జాగ్ర‌త్త‌!

నీర‌సం.అన్ని వ‌య‌సుల వారినీ త‌ర‌చూ వేధించే కామ‌న్ స‌మ‌స్య ఇది.కంటి నిండా నిద్ర లేక‌పోవ‌డం, పోష‌కాల కొర‌త‌, వేళ‌కు భోజ‌నం తీసుకోక‌పోవ‌డం, ఏదైనా జ‌బ్బు బారిన ప‌డ‌టం, షుగ‌ర్ వ్యాధి, మోనోపాజ్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నీర‌సం ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ నీర‌సంగా ఉన్న‌ప్పుడు కొన్ని కొన్ని ఫుడ్స్‌ను పొర‌పాటున కూడా తీసుకోరాదు.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ.వాటిని తింటే ఏం అవుతుంది.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా చాలా మంది నీరసంగా ఉంటే.

ఏమీ వండుకోలేక ఇంట్లో ఉండే బ్రెడ్ తింటారు.అయితే నీర‌సంగా ఉన్న‌ప్పుడు వైట్ బ్రెడ్ అస్సలు తీసుకోరాదు.

బ్రెడ్ తిన‌డం వ‌ల్ల‌ ఒంట్లో ఉన్న ఎన‌ర్జీని కూడా కోల్పోతారు.దాంతో మీరు మ‌రింత నీర‌సంగా మార‌తారు.

Advertisement

అలాగే నీర‌సంగా ఉన్న‌ప్పుడు నూనెలో వేయించినవి ఫుడ్స్ జోలికే వెల్ల‌కూడ‌దు.ఎందుకంటే, వీటిని తిన్న‌ప్పుడు నీర‌సం, అల‌స‌ట వంటివి ఎక్కువ అవ్వ‌డంతో పాటు త‌ల కూడా తిరిగిన‌ట్లు ఉంటుంది.

పాస్తా, స్వీట్ సెరెల్స్‌, కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌ వంటి వాటిని తిన్నా రిస్క్‌లో ప‌డిన‌ట్టే.కాబ‌ట్టి, నీర‌సంగా ఉన్న‌ప్పుడు ఈ ఫుడ్స్‌ను ట‌చ్ కూడా చేయ‌కండి.

మ‌రి ఆ స‌మ‌యంలో ఏం తినాలి అన్న సందేహం మీకు ఉండొచ్చు.

కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ‌, రాగి జావ‌, దానిమ్మ‌, అర‌టి పండు, ఆరెంజ్‌, యాపిల్‌, బొప్పాయి, అవ‌కాడో, న‌ట్స్‌, వోట్మీల్, స‌గ్గుబియ్యం జావ‌, కార్డ్ రైస్‌, కూర‌గాయ‌ల జ్యూసులు, స్మూతీలు, ప‌సుపు క‌లిపిన పాలు వంటివి తీసుకోవ‌చ్చు.అలాగే వాట‌ర్‌లో నిమ్మ‌ర‌సం, తేనె క‌లుపుకుని తాగినా నీర‌సం నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌తారు.ఇక ఈ ఫుడ్స్‌తో పాటు కంటి నిండా నిద్ర‌పోవాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

వాట‌ర్‌ను ఎక్కువ‌గా తాగాలి.మ‌రియు టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు