మామిడి పండ్లను అమితంగా ఇష్టపడతారా.. అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ప్రస్తుత సమ్మర్ సీజన్ లో( Summer Season ) విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో మామిడి పండ్లు( Mangoes ) ముందు వరుసలో ఉంటాయి.

ఇంకా చెప్పాలంటే ఈ సీజన్ ను మామిడి పండ్ల సీజన్ అని కూడా పిలుస్తుంటారు.

ఇక మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండనే ఉండరు.దాదాపు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా మామిడి పండ్లను తింటుంటారు.

కొందరైతే ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ లో కూడా మామిడి పండ్లనే తింటారు.అంతలా మామిడి పండ్లను ఇష్టపడుతుంటారు.

మామిడి పండ్లు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను సైతం కలిగి ఉంటాయి.అందుకే అవి ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Advertisement

అయితే మామిడి పండ్లపై అమితమైన ఇష్టం ఉన్నప్పటికీ వాటి విషయంలో కొన్ని కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా చాలా మంది పెరుగన్నంలో( Curd Rice ) మామిడి పండును కలిపి తీసుకుంటూ ఉంటారు.లేదా భోజనం చేసిన వెంటనే ఒక మామిడి పండును లాగించేస్తుంటారు.అయితే ఇలా అస్సలు చేయకండి.

ఈ విధంగా మామిడి పండును తీసుకుంటే క్యాలరీలు బాగా పెరుగుతాయి.దీంతో వెయిట్ గెయిన్ అవుతారు.

అలాగే మామిడి పండ్లు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అంటుంటారు.అది నిజమే.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

అయినా సరే చాలామంది మధుమేహం( Diabetes ) ఉన్నవారు మామిడి పండ్లు చూడగానే మనసు ఆపుకోలేరు.అలాంటివారు బాగా తియ్యగా ఉండే మామిడి పండ్లు కంటే పుల్లగా ఉండే మామిడి పండ్లు తినడం మేలని నిపుణులు చెబుతున్నారు.ఇక మామిడి పండ్లు తినడం ముఖ్యం కాదు మితంగా తినడం ముఖ్యం.

Advertisement

రోజుకు మూడు నాలుగు మామిడి పండ్లను పొట్టలోకి తోసేస్తుంటారు.కానీ ఇది చాలా పొరపాటు.

అతిగా మామిడి పండ్లు తీసుకుంటే విరేచనాలు, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.శరీరంలో వేడి పెరుగుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ తప్పుతాయి.ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

కాబట్టి ఎంత ఇష్టం ఉన్నప్పటికీ మామిడి పండ్లను మితంగా తీసుకోవాలి.

తాజా వార్తలు