వేస‌విలో ఈ పొర‌పాట్లు చేస్తే..రిస్క్‌లో ప‌డ‌టం ఖాయం!

మే నెల మొద‌లైంది.ఇప్ప‌టికే ఎండ‌ల దంచికొడుతుండ‌గా.ఈ నెల‌లో మ‌రింత ఎక్కువ‌గా ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌నున్నాయి.

ఈ సీజ‌న్‌లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ వేడిమికి డీలా పడిపోవ‌డం ఖాయం.అందుకే తీసుకునే ఆహారాల్లో, చేసే ప‌నుల్లో, ధరించే దుస్తుల్లో ఇలా అన్ని విష‌యాల్లోనూ అనేక‌ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే కొంద‌రు తెలిసో, తెలియ‌కో కొన్ని కొన్ని పొర‌పాట్లు చేస్తూ.ఈ వేస‌విలో రిస్క్‌లో ప‌డ‌తారు.ఆ పొర‌పాట్లు ఏంటీ ? ఎందుకు రిస్క్‌లో ప‌డ‌తాము ? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.సాధార‌ణంగా చాలా మంది వేస‌వి వ‌చ్చిదంటే ఏసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికే ఇష్ట‌ప‌డ‌రు.

ప‌గ‌టి పూటే కాదు రాత్రి వేళ కూడా ఏసీలోనే గ‌డుపుతారు.కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.

Advertisement
Dont Do These Mistakes In Summer! Mistakes, Summer, Latest News, Summer Tips, He

ఏసీలోనే ఎక్కువ సేపు ఉంటే లోబీపీ, కిడ్నీలో రాళ్లు, డీహైడ్రేష‌న్‌, త‌ల‌నొప్పి, శ‌రీర వేడి పెర‌గ‌డం, చ‌ర్మం పొడిబారం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి.

Dont Do These Mistakes In Summer Mistakes, Summer, Latest News, Summer Tips, He

అలాగే ఫిట్‌గా మ‌రియు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేసే వారు ఉంటారు.అయితే వేస‌విలో వ్యాయామాలు ఏ స‌మ‌యంలో ప‌డితే ఆ స‌మ‌యంలో చేయ‌రాదు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న స‌మ‌యంలో వ్యాయామాలు చేస్తే తీవ్రంగా అల‌సిపోతారు.

ఎనర్జీ మొత్తం పోతుంది.అందుకే చ‌ల్ల చ‌ల్ల‌గా ఉన్న స‌మ‌యంలో వ‌ర్కోట్లు చేసుకోవాలి.

డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు వాట‌ర్ త‌ర‌చూ తాగాల‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే కొంద‌రు అతి జాగ్ర‌త్త‌తో మ‌రీ ఎక్కువ‌గా నీళ్లు తాగుతుంటారు.

Finance And Health Minister Harish Rao Laid The Foundation Stone For The New OPD Block To Be Built

దీని వ‌ల్ల శరీరంలో ఉండే ద్రవాలు పలుచగా మారి సోడియం లెవల్స్ పడిపోయే రిస్క్ ఉంటుంది.సో రోజుకు నాలుగు లీట‌ర్ల నీరును తీసుకుంటే స‌రిపోతుంది.

Advertisement

ఇక కొంద‌రికి ముక్క లేనిదే ముద్ద దిగ‌దు.కానీ, ఈ వేస‌విలో మాంసాహారాన్ని కాస్త త‌గ్గించి తినాలి.

ఎందుకంటే, మాంసాహారంలో మ‌సాలాలు ఎక్కువ‌గా వేస్తుంటారు.ఇవి శ‌రీర వేడిని మ‌రింత పెంచుతాయి.

మ‌రియు జీర్ణ స‌మ‌స్య‌ల‌కు దారితీస్తాయి.

తాజా వార్తలు