వారంలో ఈ రెండు రోజులు ధూపం వేయకూడదు..! ఎందుకో తెలుసా..?

పూజ పురస్కారాలకు మన జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.అయితే ప్రతి ఇంట్లో దేవుడికి నిత్య పూజలు ( Pooja ) జరుగుతూ ఉంటాయి.

పూజకు సంబంధించి ఎన్నో వాస్తు నియమాలు కూడా ఉన్నాయి.అయితే ఈ నియమాలను పాటిస్తే ఇంట్లో ఎప్పుడు కూడా సుఖసంతోషాలు నెలకొంటాయి అని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.

ఇక నిత్యం పూజలు చేసిన ఆశించని ఫలితాలు రానివారు చాలామంది ఉన్నారు.ఎందుకంటే పూజ పురస్కార సమయంలో అనుకోకుండా, తెలిసి తెలియక వారు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు.

ఇలాంటి పొరపాటులలో అగర్బత్తికి సంబంధించినవి కూడా ఒకటి ఉంది.ధూపం( Dhoopam ) వేయడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.

Advertisement

వాటిని పాటించకపోతే భయంకరమైన పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.ధూపం వేయడం వలన సానుకూల శక్తిని( Positive Energy ) పెంచుకోవచ్చు.కానీ వారానికి రెండు రోజులు ధూపం వేయడం నిషేధించబడింది.

అయితే ఈ పూజ నియమం గురించి చాలామందికి అసలు తెలియదు.ఎందుకంటే వాళ్ళు తెలియక తప్పులు చేస్తూ ఉంటారు.

వాస్తు శాస్త్రం ప్రకారం వారంలో రెండు రోజులు అంటే ఆదివారం, మంగళవారం ఇంట్లో దీపాలు పెట్టకూడదు.ఈ రెండు రోజులు ఇంట్లో అగరబత్తిని కూడా వెలిగించకూడదు.

వెలిగిస్తే ఆ వ్యక్తికి దుఃఖం కలుగుతుందని చెబుతున్నారు.

కలోంజీ గింజల్లో అద్భుత ఔషధ గుణాలు

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు రోజులు వెదురును కాల్చడానికి అశుభమైందిగా భావిస్తారు.ఎందుకంటే అగర్బత్తిలోని కర్ర వెదురుతో చేసినందున అగరబత్తిని కాల్చడం నిషేధించబడింది.అందుకే మంగళవారం లేదా ఆదివారం ఇంట్లో ధూపం వెలిగిస్తే ఆర్థిక, మానసిక సమస్యలు ఎదురవుతాయి.

Advertisement

ఇంట్లో వత్తికి బదులుగా కర్పూరం, దీపం పెట్టవచ్చని శాస్త్రాలలో చెప్పబడింది.ఇక ఇది కుటుంబంలో ఆనందం, శాంతిని పెంచుతుంది.

అగరబత్తులు వెదురుతో తయారు చేస్తారు.కాబట్టి మతపరమైన కార్యక్రమాలలో వెదురులను కాల్చడం దురదృష్టం పెంచుతుంది.

అందుకే మీరు లక్ష్మీ అనుగ్రహం పొంది ఇంట్లో సుఖసంతాలు, శాంతిని తెచ్చుకోవాలంటే అగర్బత్తులను వాడకపోవడమే మంచిది.

తాజా వార్తలు