ఈ మంకీ క్యాప్ విలువ రూ.40 వేలు.. అంత ఎక్కువ ఎందుకో తెలిస్తే..

భారతదేశంలోని ప్రజలు చలి తీవ్రతను తట్టుకునేందుకు మంకీ క్యాప్ ధరించడం చాలా కామన్.

మంకీ క్యాప్ అనేది తల, చెవులు, మెడ, నోటిని కవర్ చేస్తూ కోల్డ్ వెదర్ నుంచి కాపాడుతుంది.

పాశ్చాత్య దేశాలలో దీనిని స్కీ-మాస్క్ క్యాప్స్‌గా పిలుస్తుంటారు.అయితే ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఇటువంటి టోపీలు బందర్ టోపీ అంటారు.

అంటే ఇంగ్లీష్ లో మంకీ క్యాప్ అని అర్థం.వీటిని పిల్లలు, వృద్ధులు బాగా వాడతారు.

కాగా స్వాతి మోయిత్రా (@swatiatrest) అనే ట్విట్టర్ యూజర్ డోల్స్ గబ్బానా కంపెనీ అమ్ముతున్న స్కీ మాస్క్ క్యాప్ అనే మంకీ క్యాప్ ధర చూసి ఉలిక్కిపడింది.ఎందుకంటే దాని ధర అక్షరాలా రూ.31,990.

Advertisement

నిజానికి దాని అసలు ధర రూ.40 వేలట.డిస్కౌంట్ పోను రూ.31 వేలట. ఇంత ధర ఎందుకు నిర్ణయించారంటే ఇది ఒక లగ్జరీ బ్రాండ్.

జస్ట్, బ్రాండ్ నేమ్ వాల్యూను అడ్డం పెట్టుకొని దీని ధర ఇంత పెట్టారు.లగ్జరీ ఫ్యాషన్ వెబ్‌సైట్ లో ఉన్న ఈ ధరను స్క్రీన్‌షాట్‌ తీసి స్వాతి మోయిత్రా ఈ ఖాకీ-రంగు స్కీ మాస్క్ క్యాప్ చూడండి అంటూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది.

దీన్ని చూసిన చాలామంది కూడా షాక్ అవుతారు.

మంకీ క్యాప్ చూసేందుకు చాలా సాధారణంగా ఉందని, రూ.200 వెచ్చిస్తే చాలు ఇలాంటిది బయట దొరుకుతుందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.ఇంత డబ్బు పెట్టి ఈ మంకీ క్యాప్ ఎవరు కొంటారని మరికొందరు నోరెళ్లబెడుతున్నారు.రూ.30 వేలకు పైగా దాని ప్రైస్ నిర్ణయించడం చాలా అన్యాయం అని ఇంకొందరు పెదవి విరుస్తున్నారు.

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?
Advertisement