నాలుగు లవంగాలతో ఇలా చేశారంటే మీ దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం!

తెల్లటి మెరిసేటి దంతాలను( White Teeth ) దాదాపు అందరూ కోరుకుంటారు.

ఎందుకంటే దంతాలు వైట్ గా బ్రైట్ గా కనిపిస్తుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెరుగుతాయి.

ఇతరులతో చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతారు.అలాగే తెల్లటి దంతాలు చిరునవ్వును అందంగా మారుస్తుంది.

అందుకే అటువంటి దంతాల కోసం ఆరాటపడుతుంటారు.కానీ కొందరి దంతాలు గార పట్టేసి పసుపు రంగులో ఉంటాయి.

ఖరీదైన టూత్ పేస్ట్ లను వాడిన సరైన ఫలితం ఉండదు.కానీ నాలుగు లవంగాలతో( Cloves ) ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే మీ దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం.

Advertisement

అందుకోసం ముందుగా నాలుగు లవంగాలను మెత్తగా దంచి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము,( Garlic ) హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు వన్ టేబుల్ స్పూన్ టూత్ పేస్ట్( Tooth Paste ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు తోముకోవాలి.

ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా బ్రష్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ పొందుతారు.లవంగం, వెల్లుల్లి, సాల్ట్.

ఇవి మూడు దంతాలపై పసుపు మరకలు చాలా వేగంగా వదిలిస్తాయి.దంతాలను తెల్లగా మరియు కాంతివంతంగా మెరిపిస్తాయి.

వృద్ధుడి కాలు కత్తిరించిన ఆస్ట్రేలియన్‌ అధికారులు.. ఎందుకో తెలిస్తే..
అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?

అలాగే లవంగాలు యూజినాల్ అని పిలువబడే బలమైన మత్తుమందును కలిగి ఉంటాయి.ఇది అంటువ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది.

Advertisement

అందుకే లవంగాలు కావిటీస్‌తో పోరాడడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.అంతేకాకుండా లవంగాలతో పైన చెప్పిన విధంగా బ్రష్ చేసుకుంటే దంతాల పోటు తగ్గుతుంది.నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.దంతాలు, చిగుళ్ళు దృఢంగా మరియు ఆరోగ్యంగా మారతాయి.

కాబట్టి తెల్లటి మెరిసేటి దంతాలను కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

తాజా వార్తలు