బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే మీ దంతాలు తెల్ల‌గా, దృఢంగా మార‌తాయి!

బిర్యానీ ఆకు. దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ఉండే కామ‌న్ మ‌సాలా ఇది.

బిర్యానీ ఆకును బిర్యానీలో మాత్ర‌మే కాదు నాన్ వెజ్ వంట‌ల్లోనూ వినియోగిస్తుంటారు.వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి, సువాసన అందించే బిర్యానీ ఆకులో ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అంతేకాదండోయ్‌.

బిర్యానీ ఆకుతో మ‌న దంతాల‌ను తెల్ల‌గా, దృఢంగా కూడా మార్చుకోవ‌చ్చు.చాలా మంది త‌మ దంతాలు తెల్ల‌గా లేవ‌నో, బ‌ల‌హీనంగా మారాయ‌నో తెగ బాధ‌ప‌డుతూ ఉంటారు.

Advertisement

అలాంటి వారు బిర్యానీ ఆకుతో ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా చేస్తే అద్భుత ఫ‌లితాలను సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం ప‌దండీ.

ముందుగా మూడు నుండి నాలుగు బిర్యానీ ఆకుల‌ను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకుల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌, రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్‌, రెండు టేబుల్ స్పూన్ల రెగ్యుల‌ర్ టూత్ పేస్ట్ వేసి అన్నీ క‌లిసే వ‌ర‌కు బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని బ్ర‌ష్‌తో దంతాల‌ను ప‌ట్టించి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో దంతాల‌ను, నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే.

బిర్యానీ ఆకులో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన సుగుణాలు దంతాల‌ను ముత్యాల మాదిరి తెల్ల‌గా మెరిపించ‌డ‌మే కాదు దృఢంగా కూడా మారుస్తాయి.అంతేకాదు, బిర్యానీ ఆకుతో పైన చెప్పిన విధంగా బ్ర‌ష్ చేసుకుంటే చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి ర‌క్తం కావ‌డం వంటి స‌మ‌స్య‌లు సైతం దూరం అవుతాయి.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు