నిద్రించే ముందు ఇలా చేస్తే పెదాలు మృదువుగా మెరిసిపోతాయి!

సాధార‌ణంగా కొంద‌రి పెదాలు త‌ర‌చూ పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంటాయి.ఎన్ని ర‌కాల లిప్ బామ్స్, క్రీమ్స్, ఆయిల్స్‌ వాడినా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతుంటారు.

ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌న్నిటినీ ప్ర‌య‌త్నిస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక లోలోన మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ క్రీమ్‌ను త‌యారు చేసుకుని వాడితే మీ పెదాలు మృదువుగా, కోమ‌లంగా మెరిసిపోవ‌డం ఖాయం.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ లిప్ క్రిమ్ ఏంటో.

ఎలా త‌యారు చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement
Doing This Before Going To Bed Will Make The Lips Glow Softly! Lips, Soft Lips,

ముందుగా ఒక స్ట్రాబెర్రీ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే ఒక కివి పండును తీసుకుని తొక్క తొల‌గించి స్లైసెస్‌గా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో స్ట్రాబెర్రీ ముక్క‌లు, కివి పండు ముక్క‌లు వేసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో స్ట్రాబెర్రీ-కివి జ్యూస్‌, మూడు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనె, వ‌న్ టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడ‌ర్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.బాగా మిక్స్ చేసుకున్నాక‌.

ఈ మిశ్ర‌మాన్ని డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో క్రీమీ స్ట్ర‌క్చ‌ర్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి చల్లార‌బెట్టుకోవాలి.కంప్లీట్ గా కూల్ అయిన అనంత‌రం అందులో రెండు చుక్క‌లు లెమ‌న్ ఎసెన్షియల్ ఆయిల్ ను యాడ్ చేసుకుని పొడిగా ఉన్న బాక్స్‌లో నింపుకోవాలి.

Doing This Before Going To Bed Will Make The Lips Glow Softly Lips, Soft Lips,
న్యూస్ రౌండప్ టాప్ 20

ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల పాటు యూస్ చేసుకోవ‌చ్చు.నైట్ నిద్రించే ముందు పెదాల‌కు లిప్‌స్టిక్ ఏమైనా ఉంటే తొల‌గించి వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న క్రీమ్‌ను పెదాల‌కు అప్లై చేసి సున్నితంగా మ‌సాజ్ చేసుకుని ప‌డుకోవాలి.

Advertisement

ఉద‌యాన్నే వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే పెదాలు స‌హ‌జంగానే మృదువుగా మెరిసిపోతాయి.

తాజా వార్తలు