ప్రభాస్ కి తాగే అలవాటు లేదా ?

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల వరకు పెద్ద యాక్షన్ హీరో.కండలు తిరిగిన ఆ దేహంతో ఫైట్స్ చేస్తోంటే ఈలలు వేస్తాం మనం.

ఆ కటౌట్ చూసి గోలగోల చేస్తాం.కాని సినిమాల వరకే ప్రభాస్ లో ఆ గాంభీర్యం, దూకుడు కనిపిస్తాయి.

నిజజీవితంలో ప్రభాస్ యాక్షన్ హీరో కాదు, డార్లింగ్.బిడియస్తుడు, సౌమ్యుడు.

అందుకే ప్రభాస్ ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇవ్వడు, ఇచ్చినా ఎదో బిడియంగా, సింపుల్ గా మాట్లాడటమే తప్ప, ఎక్కువ సందడి చేయడు.ఇంతమాత్రమే కాదు, ప్రభాస్ కి ఎక్కువగా తాగే అలవాటు కూడా లేదట.

Advertisement


బాహుబలి హిందీ పంపిణిదారుడు కరణ్ జోహార్ బాహుబలి సక్సెస్ పార్టి ఇవ్వబోతున్నాడు.బాహుబలి టీం, బాలివుడ్ బడా సెలబ్రిటీలు అంతా ఈ పార్టికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాడు.

కాని ప్రభాస్ ఈ పార్టికి హాజరవడం అనుమానమే అంట.ఎందుకో తెలుసా ? రెండు కారాణాలు ఉన్నాయి.
ఈ పార్టీలు మన తెలుగు హీరోలకి మొదటినుంచి అలవాటు లేదు.

ఇక బాలివుడ్ పార్టీ అంటే ఎలా ఉంటుంది.అసలే ప్రభాస్ కి బిడియం, మొహమాటం ఎక్కువ.

బాలివుడ్ జనాల గోల, వారి గొడవలు, ఆ తాగుడు .ఈ వాతావరణం ప్రభాస్ కి నప్పుదు.అందుకే పార్టికి రాలేను అని కరణ్ జోహార్ కి సున్నితంగా చెప్పాడట.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

అయినా కరణ్ ప్రభాస్ ని ఒప్పించే ప్రయత్నాలు మానట్లేదు.ఎంతైనా కథానాయకుడు లేకపోతె పార్టి కళ తప్పుతుంది కదా.మరి మన డార్లింగ్ మనసు మార్చుకుంటాడో లేదో చూడాలి.

Advertisement