ఆ ఊపు టీఆర్ఎస్ లో ఇప్పుడు లేదా ? ఆ ధీమానే దెబ్బ తీస్తోందా ?

తన ప్రత్యర్థుల మీద వ్యంగ్యంగా బాణాలు విసరడమే కాదు లౌక్యంగా మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునేలా కేసీఆర్ ప్రసంగాలు ఉంటాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ప్రసంగాలు అందరిని ఆకట్టుకున్నాయి.

ప్రత్యర్థులు కేసీఆర్ ప్రసంగాలకు బెంబేలెత్తిపోయారు.తెలంగాణ మొత్తం పర్యటించిన కేసీఆర్ ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

పార్టీ విజయం సాదించించి అధికారంలోకి వచ్చేసింది.ఇక్కడివరకు బాగానే ఉన్నా పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఆ హుషారు కనిపించడంలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కేసీఆర్ ప్రచారానికి ఊపునిచ్చే అంశాలు ఇప్పుడు పెద్దగా కనిపించకపోవడమే ఊపు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ రగల్చడం లో కేఈసీఆర్ సక్సెస్ అయ్యాడు.

Advertisement
Does Trs Overconfidence Makes Them Failure-ఆ ఊపు టీఆర్ఎస�

కూటమిగా ఏర్పడ్డ తన ప్రత్యర్థుల్లో కీలకమైన చంద్రబాబు ని టార్గెట్ చేసుకున్న ఆయన కూటమి గెలిస్తే ఏపీ నుంచే పరిపాలన సాగుతుంది.తెలంగాణ మళ్లీ చంద్రబాబు పాలన కిందకి వెళ్లిపోతుందనే భావోద్వేగ అంశాన్ని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాడు.

ఇప్పటి లోక్ సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ప్రచారంలో ఆ ఊపు కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఇప్పుడు టీడీపీని విమర్శించినా ప్రయోజనం ఏమీ ఉండదు.

అదీ కాకుండా టీడీపీ ని విమర్శిస్తే ఆ ఎఫెక్ట్ ఏపీలో వైసీపీ మీద పడే అవకాశం ఉంది.ఇవన్నీ ఆలోచించే కేసీఆర్ బాబు మీద విమర్శలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

Does Trs Overconfidence Makes Them Failure

కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు.దీనికారణంగా పెద్ద ప్రయోజనం కూడా ఏమీ కనిపించే అవాకాశం లేదు.ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి సరైన ప్రాతినిధ్యమే లేదు.

ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సీట్లు గెలిచెయ్యాలని బీజేపీ కూడా అనుకోవడం లేదు.టీఆర్ఎస్ తమకు పోటీ అని కూడా ఆ పార్టీ అనుకోవడం లేదు.

Advertisement

ఇక, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అయినా అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పుడు టీఆర్ఎస్ కి గట్టి పోటీగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.దీని కారణంగానే టీఆర్ఎస్ లో గెలుపు ధీమా కనిపిస్తోంది.

అలాంటి ధీమాతో వచ్చిన నిర్లక్ష్యం కారణంగా కేసీఆర్ హైదరాబాద్ సభ ఫెయిల్ అయినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు