ఎన్డీయేకు వైసీపీ మద్దతు అవసరమా ?

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

ఏపీలో అసెంబ్లీ( AP Assembly ) ఎన్నికలు అటు పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరిగే అవకాశం ఉండడంతో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చే పార్టీలు ఏవనే చర్చ జరుగుతోంది.

ఏపీలో మళ్ళీ అధికారంలోకి తామే వస్తామని ఈసారి 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైసీపీ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది అటు కేంద్రంలో కూడా మళ్ళీ ఎన్డీయే కూటమినే అధికారం చేపడుతుందని ఈసారి 350కి పైగా సీట్లు కైవసం చేసుకుంటామని బిజెపి ( BJP party )చెబుతోంది.ఇప్పటివరకు వచ్చిన సర్వేలు కూడా ఈ రెండు పార్టీలకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెబుతున్నాయి.

ఇదిలా ఉంచితే ఏపీలో వైసీపీ 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి .ఒకవేళ అధి జరిగితే కేంద్రంలో వైసీపీ ( YCP party )పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.ఈసారి ఎన్డీయే కూటమిని ఎలాగైనా గద్దె దించాలని విపక్షాలన్ని ఏకమౌతున్న వేల ఎన్డీయే కూటమికి సీట్లు తగ్గితే వైసీపీ అవసరం తప్పనిసరిగా ఉంటుందనేది కొందరు విశ్లేషకులు చెప్పే మాట.ఇదే విషయాన్ని వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ( Vijaya Sai Reddy )కూడా ప్రస్తావించారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అండతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు.

అయితే నిజంగా ఎన్డీయే కు వైసీపీ మద్దతు అవసరమా అంటే సమాధానం చెప్పలేని ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేస్తే.ఏ పార్టీ అండ లేకుండానే బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే ఈసారి కూడా 350 సీట్లు పక్కా అని కమలనాథులు బల్లగుద్ది చెబుతున్నారు.

Advertisement

అందుకే వైసీపీ మద్దతును బీజేపీ లైట్ తీసుకుంటోందనే చెప్పవచ్చు.ఇటీవల బీజేపీ పెద్దలు వైసీపీపై జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

రాష్ట్రంలో అవినీతి పాలనగా జగన్ సర్కార్ ను అభివర్ణిస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే బీజేపీకి వైసీపీ మద్దతు అవసరం లేదన్నట్లుగానే బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నట్లు స్పష్టమౌతోంది.

మరి రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఛేంజ్ అవుతాయో ఊహించడం కష్టం కాబట్టి ఒకవేళ వైసీపీ మద్దతు కోరాల్సి వస్తే బీజేపీ ముందు జగన్ ఎలాంటి డిమాండ్లు ఉంచుతారో చూడాలి.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు